యూ. ఏ. ఈ. లో సేల్స్, హెచ్. ఆర్., ఇంజనీర్లకు డిమాండ్
- October 29, 2015
ప్రస్తుతం యూ. ఏ. ఈ. లో సేల్స్, హెచ్. ఆర్., ఇంజనీరింగ్ రంగాలలో ఉద్యొగస్తుల హవా వీస్తోంది! గతనెలలో, మిగతా ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఆన్‌లైన్ ఉద్యోగాలలో వీరికే ఎక్కువ ప్రాముఖ్యత లభించిందని – ‘మోన్ స్టర్ మిడిల్ ఈస్ట్ ఎంప్లాయ్ మెంట్ ఇండెక్స్’ వారు ప్రకటించారు. వీరి నివేదిక ప్రకారం, సేల్స్ రంగంలోని ఉద్యోగస్తులు గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే, గరిష్టంగా, 45 శాతం అధిక శాతం ఎక్కువ ఉద్యోగాలను పొందగా, వారి తరువాతి స్థానంలో హెచ్. ఆర్., మరియు పరిపాలన విభాగ ఉద్యోగులు, మూడవ స్థానంలో ఇంజనీరింగ్ ఉద్యోగులు నిలిచారు. కాగా, వినియోగదారులు సేవల ఉద్యోగులు 20 శాతం ఉద్యోగాల తగ్గుదలతో డీలా పడ్డారు, ఇక ఎప్పుడూ డిమాండు ఉండే ఆర్ధిక మరియు అకౌంట్స్ ఉద్యోగాలు ఈసారి తగ్గకపోయినా, కేవలం 3 శాతం వృద్ధితో సరిపెట్టుకున్నాయి. ఇక మార్కెటింగ్, కమ్యు నికేషన్స్ సంబంధిత రంగాలలో ఉద్యోగాలు 5 శాతం సాధారణ వృద్ధి సాధించాయి అని వారి సర్వే సమాచారం!
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







