అక్టోబర్ నుంచి 'సైరా' మూవీ రెగ్యులర్ షూటింగ్
- September 11, 2017
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. కొణిదెల బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీని అఫిషియల్ గా లాంచ్ చేశారు. కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ పట్టలేక్కలేదు.. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.. సైరా నరసింహారెడ్డి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం...
సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ గా మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని వంద కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ బాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. అందుకే ఆయా బాషల్లోని నటుడు అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతారని ప్రధాన పాత్రలకి ఎంపిక చేసింది టీమ్. చిరు బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సైరా నరసింహారెడ్డి చిత్రానికి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది. ముందుగా ఓ సాంగ్ ని షూట్ చేయబోతుంది టీమ్. మళ్ళీ సంవత్సరం దసరా కి థియేటర్స్ లో సందడి చేసేలా చిత్ర యూనిట్ పక్కా ప్లాన్ తో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకొని సెట్స్ మీదకు తీసుకొని వెళ్తోంది చిత్ర యూనిట్..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







