మరోసారి పెరిగిన పుత్తడి ధర
- September 11, 2017
బంగారం ధర భారీ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత శుక్రవారం ఒక్కసారిగా రూ.990 పెరిగిన పసిడి.. మరుసటి రోజే రూ.820 తగ్గడం గమనార్హం. తాజాగా సోమవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం ధర మరోసారి పైకెగసింది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.470 పెరిగి రూ.31,000లకు చేరింది. పండుగ సీజన్ రానుండటం, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం బంగారం ధర పెరుగుదలకు కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క వెండి ధర కిలో రూ.42,000 దిగువకు పడిపోయింది. రూ.300 తగ్గిన వెండి కిలో రూ.41,700లకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వెండి ధర తగ్గుదలకు కారణమైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.77శాతం తగ్గి ఔన్సు 1,335.70 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







