తెలుగు, తమిళ బాషల మల్టీస్టారర్ సినిమాల్లో నాని
- September 11, 2017
అక్కినేని నాగార్జున నేచురల్ స్టార్ నానితో మల్టీస్టారర్ సినిమాలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. భలేమంచి రోజు, శమంతకమణి సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య, నాగ్, నాని కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ స్క్రిప్టును శ్రీరామ్ ఆదిత్య నాగార్జున, నానిలకు వినిపించాడు. ఇందుకు వారిద్దరూ ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి 'రాజుగారి గది 2' చేసిన నాగార్జున, ప్రస్తుతం అఖిల్ రెండవ సినిమాకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే సక్సెస్ హీరో నానితో వచ్చిన ఛాన్సును మిస్ చేసుకోకూడదని శతవిధాలా ప్రయత్నిస్తున్నారని టాక్ వస్తోంది.
మరోవైపు మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న మణిరత్నం తదుపరి ప్రాజెక్టులో కూడా నాని నటిస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక, నానిలతో పాటు శింబుకు కూడా ఈ సినిమాలో నటిస్తాడని సమాచారం. వీరితో పాటు విజయ్ సేతుపతి, మాధవన్, ఫహాద్ పాజిల్‌లను కూడా మణిరత్నం కలిసినట్లు సమాచారం. విజయ్ సేతుపతికి కాల్షీట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ ప్రాజెక్టుకు అంగీకరించే అవకాశం లేనట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభమై వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







