అమెరికా పర్యటనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ
- September 11, 2017
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు వారాల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికా బయలుదేరి వెళ్లారు. పర్యటన సందర్భంగా రాజకీయ నాయకులు, మేధావులతో ఆయన సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతోనూ మాట్లాడుతారు. తొలుత ప్రతిష్ఠాత్మక కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ ది పాత్ ఫార్వర్డ్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భారతదేశంలోని వర్తమాన రాజకీయాలపై రాహుల్ తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకోనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని యూనివర్సిటీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాం పిట్రోడా, ఇండియన్ ఓవర్సీస్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్వోసీ), యూఎస్ అధ్యక్షుడు శుద్ధ్సింగ్ శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో రాహుల్‌కు స్వాగతం పలుకుతారు. 1949లో భారత ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ ఎక్కడి నుంచి ప్రసంగించారో, అదే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాహుల్ ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







