మలబార్ గోల్డ్ ,వజ్రాల వాణిజ్య ప్రకటనలో కరీనా కపూర్ , కరిష్మా కపూర్

- September 11, 2017 , by Maagulf
మలబార్ గోల్డ్ ,వజ్రాల వాణిజ్య ప్రకటనలో కరీనా కపూర్ , కరిష్మా కపూర్

మస్కట్ : బంగారం,వజ్రాల అమ్మకంలో అయిదు ప్రముఖ ఆభరణాల చిల్లర వ్యాపారులుగా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన ఆదరణ పొందింది. మలబార్ గోల్డ్ మరియు వజ్రాల అమ్మకంలో దిగ్గజం ఈ దఫా బాలీవుడ్ తారలు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్ లతో కలిసి తొలిసారిగా తెరపైకి  కొత్త డైమండ్ ఆభరణాల కలెక్షన్ 'అల్లూర్'  కొత్త వాణిజ్య ప్రకటనను రూపొందించారు. ఇవి ఫాన్సీ ఆకృతిలో తయారుచేయబడి వజ్రాలను పొదిగి ఉండటమేకాక కొనుగోలుదారులను మంత్రముగ్ధమైన స్థితికి తీసుకెళుతుంది. ఈ 'అల్లూర్' శ్రేణికి మనోజ్ఞతను జోడించి ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో ఈ తారా సోదరీమణులు కలిసి ఇంతవరకు తెరపైన నటించలేదు. అందుచేత ఈ  కొత్త వాణిజ్య ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను  మరియు ఆభరణాల ప్రేమికుల నుంచి గొప్ప అంగీకారం పొందుతోంది. ప్రముఖుల యొక్క అధికారిక పేజీలలో  అలాగే సోషల్ మీడియాలో వారి అభిమాన పేజీలలో ఈ  కొత్త వాణిజ్య ప్రకటన ఫోటోలను పోస్ట్ చేసుకొంటున్నారు.   360 డిగ్రీల పరిధిలో డిజిటల్ ప్రచారం మరియు సోషల్ మీడియాలో ఆయా ఆభరణాల ప్రచారం ప్రారంభించబడింది, తర్వాత  టీవీ , ప్రింట్, ఓ ఓ హెచ్  మొదలైన వాటిలో ఒక బలమైన ప్రచార కార్యాచరణ జరపనున్నారు. ఫాన్సీ కట్ వజ్రాల అల్యూర్ సేకరణ కాగా , ఈ  ప్రత్యేక డైమండ్ బ్రాండ్ మైన్ నుండి తాజా సమర్పణ. ఉత్తమ ధరలు వద్ద జి ఐ ఏ / ఐ.జి.ఐ. సర్టిఫికేట్ పొందిన నాణ్యమైన వజ్రాలను అందించే ఒక  విస్తారమైన వజ్రాల ఆభరణాల సేకరణ కేంద్రం. ఇక్కడ  పియర్, ప్రిన్సెస్, మార్క్విస్, ఓవల్, హార్ట్ ఎమెరాల్డ్, కుషన్ వంటి ఫాన్సీ ఆకారంలో వజ్రాలను రూపొందిస్తారు. ఫ్యాన్సీ డైమండ్ ఆకారంతో  కొత్త వైవిధ్యాన్నిఅందిస్తుంది. గులాబీ మరియు తెలుపు బంగారు డిజైన్లతో వజ్రాల ఆభరణాలలో తాజా మరియు ఆధునిక పరిజ్ఞానంతో  రూపకల్పన చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com