డైరెక్టర్ మణిరత్నం చిత్రంలో శింబు
- September 11, 2017
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తాజాగా ఒక ఆసక్తికరమైన ప్రచారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మణిరత్నం ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అదే ఇప్పుడు వాస్తవం కాబోతోందనిపిస్తోంది.
ఆయన తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి హీరోగా నటించనున్నారని, అదే విధంగా కథానాయకిగా ఐశ్వర్యరాజేశ్ నటించనున్నారని, మరో ప్రధాన పాత్రలో నటి జ్యోతిక, అదే విధంగా అరవిందస్వామి, ఫాహద్ ఫాజిల్ వంటి ప్రముఖ నటీనటులు కూడా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ టీమ్‌లోకి సంచలన నటుడు శింబు వచ్చి చేరారు. అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం నిరుత్సాహపరిచిన తరువాత శింబు నటించే చిత్రం ఏమిటని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకిది సంతోషాన్నిచ్చే వార్తే అవుతుంది.
దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. పాటలను వైరముత్తు రాస్తున్నారట. ఈ చిత్రంతో మణిరత్నం, ఏఆర్.రెహ్మాన్, వైరముత్తుల కలయిక అన్నది రోజా చిత్రం నుంచి అంటే 25 ఏళ్లుగా కొనసాగుతోందన్నది గమనార్హం. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి సంతోష్‌శివన్ ఛాయాగ్రణను అందించనున్నారని సమాచారం. రజనీకాంత్ నటించిన దళపతి చిత్రంతో ప్రారంభమైన మణిరత్నం, సంతోష్‌శివన్‌ల కాంబినేషన్ ఆ తరువాత రోజా, ఇరువర్, ఉయిరే, రావణన్ చిత్రాల వరకూ సాగింది. తాజా చిత్రం ఆరోది అవుతుందన్న మాట. ఈ చిత్రాన్ని మణిరత్నం జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







