హత్య కేసులో వ్యక్తి అరెస్ట్ ..మృతదేహం నూతిలోనికి విసిరివేత
- September 11, 2017
మస్కట్ : ఆసియా దేశానికి చెందిన ఓ నిందితుడు హత్య చేయడమే కాక మృతదేహాన్ని పాడుబడిన నూతిలోనికి విసిరివేశాడని రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ ఓ పి) వెల్లడించింది, హంతకుడు తన నేరంను కప్పిపుచ్చుకునేందుకు విలాయట్ లోని మహ్దా లో ఎవరూ ఉపయోగించని బావిలోనికి చనిపోయిన శవాన్ని పడవేసినట్లు ఒక ఆర్ ఓ పి అధికారి తెలిపారు. విచారణ మరియు నేర పరిశోధన విభాగానికి ప్రాతినిధ్యం వహించిన ఆల్ బరియామ్ పోలీసులు ఆ హత్య కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సెప్టెంబరు 3 వ తేదీన ఒక వ్యక్తి అదృశ్యం కావడం గురించి ఒక పిర్యాదు అందుకొన్న తర్వాత ఈ కేసుని పరిశోధించేందుకు ఒక బృందం ఏర్పడింది. ఈ నేరంతో సంబంధం ఉండవచ్చనే ఒక అనుమానంతో ఆసియా దేశానికి చెందన ఓ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించడం జరిగిందని దాంతో ఆ అనుమానితుడు తానే ఆ హత్య చేసినట్లు అంగీకరించాడని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తేలిపారు.అనుమానితుడు హత్య చేసిన తర్వాత మృతదేహాన్నిబావి లోనికి తోసివేసినట్లు దర్యాప్తు బృందంకు తెలిపాడు. కాగా చనిపోయిన వ్యక్తి శరీరంపై కత్తులతో పొడిచినట్లు పలు గాయాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







