దసరా బరిలో పెద్ద హీరోలతో సై అంటే సై అంటున్న యంగ్ హీరో
- September 11, 2017
శర్వానంద్ కి ఆడియన్స్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. డిఫరెంట్ స్టోరీస్ ని సెలక్ట్ చేసుకుంటూ, తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది. తన ధైర్యం గురించి. ఎందుకంటే కొంత కాలంగా పెద్ద హీరోలు వచ్చినప్పుడే తన సినిమాని కూడా విడుదల చేసి హిట్ కొడుతున్నాడు.
గతేడాది సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా, డిక్టేటర్, నాన్నకు ప్రేమతో మధ్య తన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాని విడుదల చేసి హిట్ కొట్టాడు. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణ మధ్య, శతమానంభవతి మూవీతో వచ్చి మళ్ళీ హిట్ కొట్టాడు...
ఇక ఈ సారి దసరా బరిలో దిగడానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. తన కొత్త సినిమా మహానుభావుడుని ఈ నెల 29న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. దీనికి వారం ముందుగా తారక్ జైలవకుశతో వస్తున్నాడు. అలాగే రెండు రోజులు ముందుగా మహేష్ బాబు స్పైడర్ తో వస్తున్నాడు.
స్పైడర్, జైలవకుశ చిత్రాలకు పోటీగా మహానుభావుడుని తీసుకొస్తుండటంతో, ఈ సారి కూడా శర్వానంద్ ఇండస్ట్రీతో పాటు, ఆడియన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారాడు. మారుతి దర్శకత్వంలో మెహ్రీన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు రిలీజైన రెండు సాంగ్స్ కూడా బాగున్నాయి. పాజిటివ్ బజ్ ఉన్న మహానుభావుడుతో శర్వానంగ్ తన సెంటిమెంట్ ని కొనసాగిస్తాడో లేదో చూద్దాం మరి..
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







