యూఏఈ, సౌదీ అరేబియాల్లో అత్యధిక సేలరీ హైక్స్
- September 11, 2017
జిసిసి వ్యాప్తంగా జరిగిన ఓ సర్వేలో సౌదీ అరేబియా, రీజియన్ మొత్తానికి సేలరీ హైక్స్ విషయంలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 600 మల్టీనేషనల్ కంపెనీలు, స్థానికంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో జరిగిన సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2016లో అంచనాలకు తగ్గట్టుగా సేలరీ హైక్ కనిపించలేదు. జిసిసి వ్యాప్తంగా మారిన ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో సేలరీ హైక్ మీద తీవ్ర ప్రభావమే పడింది. అయితే 2017 నాటికి పరిస్థితులు పుంజుకున్నాయి. 2018 నాటికి ఇంకా మెరుగైన పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. జిసిసి కాంపెన్సేషన్ సర్వే మేనేజర్ రోబర్ట్ రిచర్ మాట్లాడుతూ, అంచనాలకంటే కొంత తక్కువగానే ఉన్నా, ఈసారి హైక్ ఆశాజనకంగానే ఉన్నట్లు వివరించారు. సౌదీ అరేబియా 2017లో అంచనా పెరుగుదల 4.9 కాగా, 4.4 వాస్తవ పెరుగుదల నమోదయ్యింది. కువైట్ 4.3 అంచనా ఉంటే, వాస్తవ పెరుగుదల 4.5 గా ఉంది. యూఏఈ 4.6 అంచనా పెరుగుదల, 4.3 వాస్తవ పెరుగుదల ఉంది. బహ్రెయిన్ 4.7 అంచనా, 3.9 వాస్తవం. ఒమన్ 4.6 అంచనా, 3.9 వాస్తవం.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







