కార్తీ, రకుల్ జంటగా ఆదిత్య మ్యూజిక్ ఉమేశ్ గుప్తా సినిమా ‘ఖాకి - ది పవర్ ఆఫ్ పోలీస్'
- September 12, 2017
రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ‘ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’. ఈ సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల సంగీతాన్ని విడుదల చేసి సంగీత ప్రపంచంలో, శ్రోతల మదిలో సముచిత స్థానాన్ని సంపాదించుకుందీ సంస్థ. రెండున్నర దశాబ్దాలు సినిమా రంగాన్ని అతి దగ్గరగా పరిశీలించిన అనుభవంతో ‘ఆదిత్య మ్యూజిక్’ ఉమేశ్‌గుప్తా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. అందులో భాగంగా కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన తమిళ సినిమా ‘ధీరన్ అదిగారమ్ ఒండ్రు’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సినిమాను తెలుగులో ‘ఖాకి’గా విడుదల చేస్తున్నారు ఉమేశ్ గుప్తా. ‘ద పవర్ ఆఫ్ పోలీస్’... అనేది ఉపశీర్షిక. సూపర్ హిట్ తమిళ సినిమా ‘చతురంగ వేటై్ట’ ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా ‘ఆదిత్య మ్యూజిక్’ సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ– ‘‘ఇందులో కార్తీ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్ పరంగా ఆయన చాలా కేర్ తీసుకున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్. వినోద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్ తీసుకున్నా. తెలుగులో ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘బాబు బంగారం’, ‘హైపర్’ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్ ఈ సినిమాకూ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. అతి త్వరలో టీజర్ ను, పాటలను , చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూరన్, ఆర్ట్: కె. ఖదీర్, ఎడిటర్: శివనందీశ్వరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, డ్యాన్స్: బృంద, నిర్మాతలు: ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







