ప్రవాసీల కోసం 15న ఓమాన్ లో ఓపెన్ హౌజ్
- September 12, 2017
* ప్రతినెల మూడవ శుక్రవారం మస్కట్ లో ప్రవాసి ప్రజావాణి
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఓమాన్ దేశ రాజధాని మస్కట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఈనెల 15న మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గం.ల వరకు ఓపెన్ హౌజ్ అనే బహిరంగ సామాజిక సమావేశం నిర్వహిస్తారు. ఓమాన్ దేశంలో నివసించే ప్రవాస భారతీయ భవననిర్మాణ కార్మికులు, ఇంటిపనిచేసే మహిళలు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ప్రతినెల మూడవ శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఓమాన్ లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ +968 2469 5981 లేదా మొబైల్ నెంబర్ +968 9276 9735 కు కాల్ చేయవచ్చు.
వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్ లోని వారి బంధువులు డిల్లీ లోని టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-3090, హాట్ లైన్ నెంబర్ +91-11-4050 3090, మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ హెల్ప్ లైన్ నెంబర్ +91 93944 22622 కు గాని కాల్ చేయవచ్చు. ఆంద్ర ప్రదేశ్ వారు ఎపి ఎన్నారై విభాగం నెంబర్ +91 97059 06976 కు, తెలంగాణ వారు టి-ఎన్నారై విభాగం నెం. +91 94408 54433 కు కాల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







