సౌదీ అరేబియా ఐఎస్‌ బాంబ్‌ ప్లాట్‌: సౌదీలో నలుగురి అరెస్ట్‌

- September 12, 2017 , by Maagulf
సౌదీ అరేబియా  ఐఎస్‌ బాంబ్‌ ప్లాట్‌: సౌదీలో నలుగురి అరెస్ట్‌

ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌కి చెందిన నలుగురు వ్యక్తుల్ని సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్‌ అదుపులోకి తీసుకున్నాయి. నిందితులు సూసైడ్‌ బాంబర్లుగా మారి విధ్వంసానికి యత్నించారని సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్‌ తెలిపారు. వారిలో ఇద్దరు యెమనీయులు కాగా, మరో ఇద్దరు సౌదీకి చెందిన వారు. ఈ నలుగురూ ఐఎస్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులుగా గుర్తించారు. రియాద్‌లోని రెండు డిఫెన్స్‌ మినిస్ట్రీ హెడ్‌ క్వార్టర్స్‌ని నిందితులు టార్గెట్‌ చేశారు. సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ విడుదల చేసిన ఫొటోల్లో నిందితులకు సంబంధించిన వివరాలున్నాయి. మానవ బాంబులుగా మారేందుకు వారు వినియోగించదలచిన ఆయుధాల్ని కూడా ప్రదర్శించారు. 2014 నుంచి షియాస్‌, సెక్యూరిటీ ఫోర్సెస్‌కి వ్యతిరేకంగా ఐఎస్‌ తీవ్రవాద సంస్థ పలు దాడులకు వ్యూహరచన చేస్తూనే ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com