యూఏఈ రోడ్డు ప్రమాదం: యంగ్ డ్రైవర్ మృతి
- September 12, 2017
రస్ అల్ ఖైమా: 21 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేసింది. యువకుడు ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో ఉండగా చెట్టుని ఢీకొంది. చెట్టును ఢీకొన్న అనంతరం, ల్యాంప్ పోస్ట్ వైపుకు కారు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రస్ అల్‌ఖైమాలోని అల్ దగ్దగ - ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే అక్కడికి చేరుకున్నామనీ, దురదృష్టవశాత్తూ యువకుడ్ని ప్రాణాలతో కాపాడలేకపోయామని రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ కంట్రోల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. రోడ్డుపై వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా బ్రిగేడియర్ అల్ హుమైది వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







