యాపిల్ కంపెనీ ప్రవేశపెడుతుంది ఐఫోన్ 8, 8 ప్లస్, 10
- September 12, 2017
కొత్త ఐఫోన్ వచ్చేసింది. ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యూచర్ వండర్‌ని రిలీజ్ చేసింది యాపిల్. కొత్త ఐఫోన్ సిరీస్‌కు సంబంధించిన ఊహగానాలకు తెరదించింది. ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఐఫోన్ టెన్ పేరిట తన తాజా సంచలనాన్ని మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటితో పాటు ఐఫోన్8, ఐఫోన్8 ప్లస్ పేరిట మరో రెండు మోడళ్లను కూడా విడుదల చేసింది. ఐఫోన్ 10ను యాపిల్ అధినేత టిమ్ కుక్ విడుదల చేయటం విశేషం.
యాపిల్ ఐఫోన్ 10 స్క్రీన్ పరిమాణం 5.8 అంగుళాలు. OLED టెక్నాలజీతో పాటు స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, గ్లాస్ బ్యాక్, త్రీడీ టచ్, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ తదితర ప్రత్యేకతలు దీని సొంతం. 64 GB, 256 GB సామర్థ్యాల్లో లభ్యం అవుతుంది. ఐఫోన్10 ప్రారంభ ధర 999 డాలర్లు. అక్టోబర్ 27 నుంచి ప్రీ–బుకింగ్ ఓపెన్ అవుతుంది. నవంబర్ 3 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఇక ఐఫోన్ 8లో స్క్రీన్ 4.7 అంగుళాలు, ఐఫోన్ 8 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. వీటిలో 3డీ టచ్, ట్రూ టోన్ డిస్‌ప్లే ఫీచర్స్, ఏ11 ప్రాసెసర్ ఉంటాయి. సిల్వర్, స్పేస్ గ్రే, బంగారం రంగుల్లో ఇవి లభిస్తాయి. ఐఫోన్ 8లో రియర్ కెమెరా 12 మెగా పిక్సెల్, 8 ప్లస్‌లో 12 మెగా పిక్సెల్ సామర్ధ్యంతోను డ్యుయల్ కెమెరాలు ఉంటాయి. ఐఫోన్–8 ధర 699 డాలర్ల నుంచీ ఆరంభమవుతుండగా... 8 ప్లస్ ధర మాత్రం 799 డాలర్ల నుంచీ మొదలవుతోంది.
ఐఫోన్స్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 3, వాచ్ ఓఎస్4, 4కే హెచ్‌డీఆర్ వీడియో ఫీచర్‌తో కొత్త యాపిల్ టీవీ తదితర ఉత్పత్తులను కూడా యాపిల్ ఆవిష్కరించింది. కొత్తగా నిర్మించిన యాపిల్ పార్క్ కార్యాలయంలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో వీటిని ఆవిష్కరించారు. 2007 జనవరి 9న అప్పటి యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్‌ను ప్రవేశపెట్టి.. మొబైల్ కంప్యూటింగ్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశారు. అదే ఏడాది జూన్ 29 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాక ఐఫోన్ రాత్రికి రాత్రే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. స్టీవ్ జాబ్స్ ఎప్పటికీ తమ జ్ఞాపకాల్లో ఉండిపోతారని టిమ్ కుక్ చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







