బ్రిటన్ పర్యటనకు-మోదీ
- October 29, 2015
క్వీన్ ఎలిజబెత్ తో విందు, వెంబ్లే స్టేడియంలో ప్రసంగం, బ్రిటీష్ పాలకులతో భేటీలు... ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన షెడ్యూల్. భారత ప్రధాని హోదాలో వచ్చే నెల తొలిసారి బ్రిటన్ పర్యటనకు మోదీ వెళుతున్నారు. నవంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ లో ఆయన పర్యటిస్తారు. మోదీతో కలిసి ప్రధాన కార్యక్రమాలన్నిట్లోనూ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పాల్గొననున్నారు. నరేంద్ర మోదీ గౌరవార్థం నవంబర్ 13న బకింగ్ హ్యామ్ ప్యాలెస్ లో క్వీన్ ఎలిజబెత్ విందు ఇవ్వనున్నారు. వెంబ్లే స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు 60 వేల మందిపైగా ఎన్నారైలు హాజరువుతారని భావిస్తున్నారు. తర్వాత కామెరూన్ తో భేటీ అవుతారు. సమయం ఉంటే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. నవంబర్ 14న ఉత్తర లండన్ లో అంబేద్కర్ మెమోరియల్ ను, 12వ శతాబ్దపు తత్వవేత్త బసవేశ్వర విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







