దుబాయ్ రాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న ఇండియన్ డ్రైవర్
- September 12, 2017
దుబాయ్:భారతదేశానికి చెందిన వేలు వేణుగోపాల్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ సందర్భంగా 1 మిలియన్ డాలర్లను రఫాలెలో గెల్చుకున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో అతనికి బహుమతి లభించినా, డ్రైవర్‌గా తన కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాడాయన. 'నేను పెద్ద మొత్తంలో సొమ్ముని బహుమతిగా పొంది ఉండొచ్చు. కానీ నా పని నేను చేసుకుపోవాలి కదా' అని వేలు వేణుగోపాలన్ చెప్పారు. కేరళకు చెందిన వ్యక్తి ఈయన. వేణుగోపాల్ ఈ బహుమతి గెల్చుకున్న 121వ వ్యక్తి. మొత్తం 252 రఫాలె డ్రాస్ ఇప్పటిదాకా జరిగాయి. చాలా ఏళ్ళుగా తాను రపాలె టిక్కెట్స్ కొనుగోలు చేస్తున్నాననీ, ఈ సారి తనను అదృష్టం వరించిందని చెప్పారు. 1987లో వేణుగోపాల్, యూఏఈకి వెళ్ళారు. 30 ఏళ్ళ తర్వాత వేణుగోపాల్ తిరిగి తన స్వదేశానికి వెళ్ళి, గెలిచిన సొమ్ముతో వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







