ఇస్లాంని కించపర్చిన వ్యక్తికి జైలు
- September 12, 2017
దుబాయ్:సోషల్ మీడియాలో ఇస్లాంని కించపర్చుతూ సందేశాలు పోస్ట్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. భారతదేశానికి చెందిన 31 ఏళ్ళ కార్మికుడు, ప్రొఫెట్ మొహమ్మద్‌ని కించపర్చేలా ఫేస్‌బుక్ సందేశాలు పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్‌ని ఆ తర్వాత సదరు వ్యక్తి తొలగించాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సాక్ష్యాధారాలతో నిందితుడ్ని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. తనపై వచ్చిన అభియోగాల్ని నిందితుడు ఖండిస్తూ, తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని పేర్కొన్నాడు. అయితే న్యాయస్థానం నిందితుడి అప్పీల్‌ని తిరస్కరించింది. అయితే మరోమారు న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం నిందితుడికి లభించింది. ప్రస్తుతం నిందితుడిపై 500,000 దిర్హామ్‌ల జరీమానా, ఏడాది జైలు, జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ శిక్షల్ని విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







