ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్ రివర్స్
- September 13, 2017
అందరూ భాగస్వాములు కావాలి
జగ్గీ వాసుదేవ్
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో విజయవాడలో 'ర్యాలీ ఫర్ రివర్స్' కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు పాల్గొన్నారు. నదులను పరిరక్షించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 16 రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. కేరళ, తమిళనాడు, పుదేచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో ఈషా ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకుంది.
ఈ సందర్భంగా జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ ర్యాలీ ఫర్ రివర్స్‌లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. నదులు శుష్కించిపోవడానికి కారణం మనమేనని పేర్కొన్నారు.
నదుల పరిరక్షణకు అందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







