ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్‌ రివర్స్‌

- September 13, 2017 , by Maagulf
ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్‌ రివర్స్‌

అందరూ భాగస్వాములు కావాలి 
జగ్గీ వాసుదేవ్‌ 
ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ నేతృత్వంలో విజయవాడలో 'ర్యాలీ ఫర్‌ రివర్స్‌' కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు పాల్గొన్నారు. నదులను పరిరక్షించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 16 రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. కేరళ, తమిళనాడు, పుదేచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో ఈషా ఫౌండేషన్‌ ఒప్పందాలు చేసుకుంది.
ఈ సందర్భంగా జగ్గీ వాసుదేవ్‌ మాట్లాడుతూ ర్యాలీ ఫర్‌ రివర్స్‌లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. నదులు శుష్కించిపోవడానికి కారణం మనమేనని పేర్కొన్నారు.
నదుల పరిరక్షణకు అందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com