రిలీజ్ కి నోచుకోని తేజు 'జవాన్'
- September 13, 2017
ఒక సారి సినిమా రిలీజ్ డేట్ మారిందంటే..ఆ తర్వాత మరో డేట్ ఫిక్స్ చేసుకోవడం ప్రస్తుతం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. దీంతో పోటీ తక్కువగా ఉన్నప్పుడు రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా వాయిదాల బాటలో నడవాల్సిందే. ఇప్పుడు జవాన్ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ మూవీ అక్టోబర్ చివరికి పోస్ట్ పోన్ అయ్యింది. సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా జవాన్. బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్. ఈ మూవీలో తేజూ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఆల్ రెడీ రిలీజైన ఫస్ట్ లుక్ స్టిల్స్, టీజర్ తో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. గత చిత్రాలు నిరాశపరచడంతో తేజూ... జవాన్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
జవాన్ మూవీని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది టీమ్. కానీ అదే డేట్ కి బాలకృష్ణ పైసా వసూల్ తో వచ్చాడు. దీనికంటే ముఖ్యమైన కారణం... ఆ సినిమాకి కొన్ని సీన్లు రీ షూట్ చేయాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సజెస్ట్ చేశాడు. దీంతో జవాన్ టీమ్ ప్రజెంట్ అదే పనిలో ఉంది. అందుకే సినిమా మరింత ఆలస్యం అవుతోంది. కానీ ఇప్పటి నుంచి దీపావళి వరకు సినిమాలు వరుసగా వస్తుండటంతో, జవాన్ ని అక్టోబర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







