పెరుగుతున్న పుత్తడి ధరలు, తగ్గుతున్న అమ్మకాలు
- September 13, 2017
అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు వారం రోజులుగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నారు. పదిగ్రాముల బంగారం ధర రూ.31,450కి చేరింది. గత వారం రోజుల్లో శుక్రవారం ఒక్కరోజే గ్రాముకు రూ.990 కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ క్షీణించడంతో ఇన్వెస్టర్ల దృష్టి బంగారం పై పడింది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దసరా సీజన్, స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కారణంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 32 వేలకు చేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవిధంగా బంగారం ధరలు రోజు రోజుకు పెరగడానికి పలు కారణాలు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులకు లోనుకావడం ఒకటైతే మరోవైపు మధుపరులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం ధరల పెరుగుదలకు మరో కారణంగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







