భారీగా అమ్ముడుపోయిన పవన్ త్రివిక్రంల మూవీ రైట్స్
- September 13, 2017
'కాటమరాయుడు' తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం విడుదల కాకముందే రికార్డు సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ 25వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్‌హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. సినిమా అమెరికా, నైజాం హక్కులు రూ. 50 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా తెలిపారు. అమెరికాలో రూ. 21 కోట్లకి, నైజాంలో రూ. 29 కోట్లకి అమ్ముడుపోయినట్లు ట్వీట్ చేశారు.
'బాహుబలి 2' కాకుండా థియేట్రికల్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రాబట్టిన తెలుగు చిత్రం ఇదేనని పేర్కొన్నారు.
పవన్ 25వ చిత్రంలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయెల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఖుష్బూ, మురళీశర్మ, రావురమేశ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







