వలసదారుల నిషేధంపై అమెరికాకి తాత్కాలిక వూరట: సుప్రీంకోర్టు
- September 13, 2017
వలసదారులపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అమెరికా సుప్రీంకోర్టు దన్నుగా నిలిచింది. నిషేధాన్ని సడలిస్తూ, అక్టోబరు నెలాఖరులోగా 24 వేల మంది శరణార్థుల్ని దేశంలోకి అనుమతించడానికి దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని ట్రంప్ యంత్రాంగం చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు అనుమతించారు. అయితే తుదితీర్పు వెలువడాల్సి ఉంది. ముస్లింల ఆధిక్యంఉన్న ఆరు దేశాలు, ప్రపంచంలోని ఎక్కడినుంచైనా శరణార్థులు అమెరికాకు రాకుండా ట్రంప్ విధించిన నిషేధంపై వాదనలు అక్టోబరు 10న కొనసాగనున్నాయి. ముందు ప్రకటించిన ప్రకారం ముస్లిం దేశాలపై విధించిన 90 రోజుల నిషేధం ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. శరణార్థులపై నిషేధం వచ్చే నెలాఖరు వరకు ఉంటుంది. వీటిని కొనసాగిస్తారా, శాశ్వత ప్రాతిపదికన ఆంక్షలు విధిస్తారా, లేదా ఇతర దేశాలనూ జాబితాలో చేరుస్తారా అనేది యంత్రాంగం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ ఉత్తర్వులోని కీలక అంశాలను న్యాయస్థానం సమర్థించిందని శ్వేతసౌధం ప్రతినిధి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







