ఇండిగో స్పెషల్ ఆఫర్స్ కేవలం Rs 1174 నుంచి మొదలు
- September 14, 2017
ప్రముఖవిమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ తక్కువ ధరలో విమాన టెకెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ మార్కెట్‌లో ఎంపిక చేసిన మార్గాల్లో వన్-వే విమానాల్లో రూ.1174 ( అన్నీ చార్జీలు కలుపుకొని) ప్రారంభ ధరలను ఆఫర్ చేస్తోంది.
విమానయానంలో నెలకొన్న బలమైన పోటీని క్యాష్ చేసుకునే యోచనలో ఇండిగో ఈ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ఇండిగో వెబ్‌సైట్ ప్రకారం చెన్నై-బెంగళూరు మార్గంలో టికెట్ ధర్ రూ.1,174గాను, ఢిల్లీ నుండి జైపూర్ కు రూ.1,178 రూ. జమ్మూ- శ్రీనగర్ రూ. 1,220గా ఉంది. శ్రీనగర్-జమ్మూ రూ.1583, రూ. చండీగడ్-ఢిల్లీ రూ.1,592, రూ. లక్నో-ఢిల్లీ రూ. 1,597 ధరల్లో టికెట్ లుఅందుబాటులో ఉండనున్నాయి. ఇండిగో బుకింగ్స్ పోర్టల్ లో అక్టోబర్ , నవంబర్ కాలానికి చెన్నై - బెంగళూరు మధ్య బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. దీనికి అదననంగా నాన్ రిఫండబుల్ ఫీజు రూ. 200 ను రద్దు చేయనుంది. అయితే దీనికి ఇంటర్ నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ కార్డులు / డెబిట్ ద్వారా చేసే అన్ని ఆన్‌లైన్ చెల్లింపులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.
అలాగే ఎయిర్ పోర్టుకు అనుకున్న సమయం కంటే ముందుగా చేరుకున‍్న ప్రయాణీకులకు రూ.1000 అదనపు తగ్గింపును ప్రకటించింది. తమ ప్రయాణాన్ని కనీసం నాలుగు గంటలకు ముందుకు జరుపుకున్న వారికి ఇండిగో ఎర్లీ పేరుతో ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే టికెట్ బుకింగ్ సమయంలోఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి వుంటుంది. దేశీయ రూట్లలో డిమాండ్‌ను పెంచడానికి ఈనిర్ణయం తీసుకున్నట్టు ఇండిగో తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







