మజ్నులో నాగచైతన్య, వెంకటేష్ మరియు నాగ్
- October 29, 2015
టాలీవుడ్ స్క్రీన్ మీద మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. కథాపరంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే స్థాయి కథలు రాకపోయినా గెస్ట్ అపియరెన్స్ లతో అదరగొడుతున్నారు స్టార్స్. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోలతో కలిసి నటించడానికి సీనియర్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే బ్రూస్ లీ సినిమాతో మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చేయటంతో మరో ఫ్యామిలీ నుంచి కూడా ఇలాంటి కాంబినేషన్ తెర మీద సందడి చేయనుంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమా పూర్తవ్వగానే మళయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ రీమేక్ లో నటించనున్నాడు. తెలుగులో మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. ఇటీవల ఈ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్న చిత్రయూనిట్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తుంది. చైతూ సరసన మళయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఓ ఇంపార్టెంట్ రోల్ ను సీనియర్ హీరో వెంకటేష్ తో చేయించాలని భావిస్తున్నారు. వెంకీతో పాటు మరో అతిథి పాత్రలో నాగ్ కూడా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. నాగచైతన్యకు ఈ రెండు కుటుంబాల నేపథ్యం ఉండటంతో మజ్ను సినిమాలో నాగ్, వెంకీలు నటించటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి గాసిప్ గా ఉన్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







