సినిమా ప్రమోషన్ కోసం రేడియో జాకీగా మరీనా విద్యాబాలన్

- September 15, 2017 , by Maagulf
సినిమా ప్రమోషన్ కోసం రేడియో జాకీగా మరీనా విద్యాబాలన్

బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ విద్యాబాలన్. 'డర్టీ పిక్చర్స్‌'తో దేశం మొత్తాన్ని ఊపేసిన విద్య 'కహానీ' చిత్రంలో చేసిన పాత్రకు కూడా మంచి నటి అని గుర్తింపు తెచ్చుకుంది. వైవిద్యమైన చిత్రాలలో నటిస్తూ దూసుకెళ్తున్న నటి విద్యాబాలన్ ఒక్కో చిత్రంలో ఒక్కో వేషధారణతో ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటుంది.  ఇప్పుడు మరో సినిమా 'తుమ్హారీ సులు' లో రేడియో జాకీగా కనబడనుంది. 'ఐయాం ఆర్జే సులు' అంటూ విద్యాబాలన్ రేడియో జాకీగా గల గలా మాట్లాడేస్తోంది. రేడియోలో పని చేస్తూనే సాధారణ గృహిణి పాత్రలో కూడా అద్భుతంగా ఒదిగిపోయింది.  ఈ చిత్రాన్ని కేవలం 42 రోజుల్లోనే పూర్తి చేశారట.  దీనికి సంబంధించిన టీజర్‌ను ఈ రోజే విడుదల చేశారు. టీజర్‌లో విద్యాబాలన్ వాయిస్‌కి నెటిజన్లు ఫిదా.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com