ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి వినతి పత్రం సమర్పించిన కేతిరెడ్డి
- September 15, 2017
తమిళనాడు తెలుగు యువశక్తి, అధ్యక్షుడు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి దక్షిణాది ని రక్షించుతాముI అను నినాదం తో అమ్మ జన సేన రాజకీయ పార్టీ గురించి, ఆ విధివిధానాలను .... .తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నందు తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని, చెన్నై లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన పొట్టి శ్రీరాములు హల్ కు పొట్టి శ్రీరాములు ఆంధ్ర భవన్ అని పేరు పెట్టాలని, తొలి తెలుగు స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఆంధ్ర రాజధాని నందు పెట్టించాలని ఉయ్యాలవాడ ను జాతీయ వీరుడు గా గుర్తించాలని. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని ఉరితీసిన జుర్రటివాగు ప్రాంతంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ద లని , డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కొరకు డ్రగ్స్ వాడువారిని అమ్మువారి పై దేశ ద్రోహ నేరస్తులు గా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తేవాలని ,చలనచిత్ర ల లో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు సంభంధం ఉన్న సన్నివేశాలు ఉండకూడదని, తమిళనాడు రాష్ట్రంలో ఆక్రమణ కు గురి కాబడిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన సదవర్తి భూములు సుమారు 380 ఎకరాల భూమికి ప్రత్నానాయ భూమిని కానీ , డబ్బులను కానీ తమిళనాడు ఆక్రమణ దారుల వద్ద వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నకు ఇవ్వాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 14 వ తేదీ రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వెలగపూడి సచివాలయంలో కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు, వారి తో పాటు వారి తనయుడు నారా లోకేష్ దృష్టికి కూడా ఈ సమస్యలను తీసుకువచ్చారు..
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







