లండన్ పార్సన్స్ గ్రీన్ రైల్వే స్టేషన్ ట్యూబ్ ట్రైన్‌లో పేలుళ్లు
- September 15, 2017
పార్సన్స్ గ్రీన్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం పేలుళ్ళు సంభవించాయి. ట్యూబ్ ట్రైన్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. లండన్ మెట్రో పాలిటన్ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
రైలు వెనుక భాగంలో ఓ బకెట్ నుంచి పేలుళ్ళు వినిపించాయని అంటున్నారు. సంఘటనా స్థలానికి భద్రతాధికారులు హుటాహుటిన తరలి వెళ్ళారు. తనిఖీలు నిర్వహించేందుకు రైల్వే స్టేషన్‌ను మూసివేశారు. చాలా మంది ప్రయాణికులు కాలిన గాయాలతో పరుగులు తీస్తున్నట్లు సమాచారం.
అత్యవసర సహాయక దళాలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ లండన్‌లో ఉంది. ఇది అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారని పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







