ఈజిప్ట్ వ్యక్తి నుంచి 4 వేల మాదక ద్రవ్య మాత్రలు స్వాధీనం
- September 15, 2017
మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే, గల్ఫ్ దేశాలలో కఠినమైన శిక్షలు అక్కడ విధిస్తారని తెల్సినప్పటికే అక్రమ రవాణాదారులు తమ తరలింపు తంతుని మానడంలేదు. తాజాగా ఈజిప్ట్‌కు చెందిన ఓ వ్యక్తి కువైట్‌కు వలస వెళ్లాడు. కువైట్ విమానాశ్రయంలోకి రాగానే ఆ ఈజిప్టియడు కొంత ఆందోళనగా కనిపించాడు. పోలీసులను చూసి కంగారుగా వేగంగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు హడావిడి పడ్డాడు. ఆ అనుమానితుడి వ్యవహారశైలీని విమానాశ్రయ అధికారులకు సందేహం కల్గింది. ఆ వ్యక్తికి చెందిన బ్యాగును క్షుణంగా తనిఖీ చేయగా అందులో ఓ ప్యాకెట్ కనిపించింది. ఆ బ్యాగులో 4వేల మాదకద్రవ్య మాత్రలు కంటపడ్డాయి. ఆ నిషేధిత మాత్రలు కువైట్‌లో కల్గి ఉండటమే పెద్ద నేరం కావడంతో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు. అనంతరం ఆ మాధకద్రవ్యాలని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







