ఈజిప్ట్‌ వ్యక్తి నుంచి 4 వేల మాదక ద్రవ్య మాత్రలు స్వాధీనం

- September 15, 2017 , by Maagulf
ఈజిప్ట్‌ వ్యక్తి నుంచి  4 వేల మాదక ద్రవ్య మాత్రలు స్వాధీనం

 మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే, గల్ఫ్ దేశాలలో కఠినమైన శిక్షలు అక్కడ విధిస్తారని తెల్సినప్పటికే అక్రమ రవాణాదారులు తమ తరలింపు తంతుని మానడంలేదు. తాజాగా  ఈజిప్ట్‌కు చెందిన ఓ వ్యక్తి కువైట్‌కు వలస వెళ్లాడు. కువైట్ విమానాశ్రయంలోకి రాగానే ఆ ఈజిప్టియడు  కొంత ఆందోళనగా కనిపించాడు. పోలీసులను చూసి కంగారుగా  వేగంగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు హడావిడి పడ్డాడు.  ఆ అనుమానితుడి వ్యవహారశైలీని విమానాశ్రయ అధికారులకు సందేహం కల్గింది. ఆ వ్యక్తికి చెందిన బ్యాగును క్షుణంగా తనిఖీ చేయగా అందులో ఓ ప్యాకెట్ కనిపించింది. ఆ బ్యాగులో 4వేల మాదకద్రవ్య మాత్రలు కంటపడ్డాయి. ఆ నిషేధిత మాత్రలు కువైట్‌లో కల్గి ఉండటమే పెద్ద నేరం కావడంతో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు.  అనంతరం ఆ మాధకద్రవ్యాలని  డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com