దేవాలయ అర్చకులకు, ఉద్యోగులకు శుభవార్త

- September 15, 2017 , by Maagulf
దేవాలయ అర్చకులకు, ఉద్యోగులకు శుభవార్త

రాష్ట్రంలోని దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే మరో 3 వేల దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం అమలు చేసేందుకు అంగీకరించింది. అంతేగాక దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాల పర్యవేక్షణకు కొత్తగా ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com