నూతన తారలు కావలెను - పూరి జగన్నాధ్
- September 15, 2017
మీరు వెండి తెర ఫై కనిపించాలని , మీ టాలెంట్ తో అభిమానులను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..అయితే వెంటనే 'పూరి కనెక్ట్' ను సంప్రదించండి..ఎందుకంటే త్వరలో పూరి చేయబోయే కొత్త సినిమా కోసం కొత్త నటీనటులను తీసుకుంటున్నాడు. ఈ మేరకు ప్రకటన చేసాడు. ఇటీవల బాలయ్యతో చేసిన పైసా వసూల్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముస్కాన్. పూరి స్థాపించిన 'పూరి కనెక్ట్' అనే కంపెనీ నుంచి ఈ అమ్మడు వెండి తెర కు పరిచయం అయ్యింది. ఇప్పుడిదే సంస్థ మరోసారి నటీనటుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
18-50ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎవరైనా పూరి కనెక్ట్ ను సంప్రదించవచ్చు. కానీ వాళ్ల దగ్గర యాక్టింగ్ టాలెంట్ ఉండాలి అని తెలిపింది. తన కొత్త సినిమాకు వాళ్లు పనికొస్తారని తెలిస్తే వెంటనే అగ్రిమెంట్ చేసుకోడానికి సంస్థ రెడీగా ఉన్నట్లు తెలిపింది. ఈ వ్యవహారాలన్నింటినీ చార్మి దగ్గరుండి చూసుకుంటుంది. కాకపోతే నటీనటుల ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం పూరిజగన్నాధ్ దే. ఫైనల్ లిస్ట్ తయారుచేయడం వరకు చార్మి పని అంటున్నారు.
ప్రస్తుతం పూరి తన కొడుకు ఆకాష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయ్యినట్లు సమాచారం. ఈ మూవీ లోనే కొత్త నటి నటులను తీసుకొన బోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం మిలో టాలెంట్ ఉంటే వెంటనే 'పూరి కనెక్ట్' ను సంప్రదించండి.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







