అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- January 19, 2026
మనామా: బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అల్-సఫ్రియా ప్యాలెస్‌లో అవాలి సిటీ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించారు. ఇందులో హ్యూమటేరియన్ మరియు యువజన వ్యవహారాల ప్రతినిధి, బాప్కో ఎనర్జీస్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫాతోపాటు కంపెనీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బహ్రెయిన్ నగరాలు మరియు గ్రామాలను వాటి చారిత్రక , సాంస్కృతిక గుర్తింపును కాపాడుతూ అభివృద్ధి చేయడానికి కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవాలి సిటీ అభివృద్ధి కోసం ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ను హిజ్ మెజెస్టి సమీక్షించారు.
ఈ ప్రణాళికలో వాణిజ్య, కార్యాలయ మరియు నివాస యూనిట్లు, గార్డెన్లు, పెడస్టేరియన్ జోన్లు, స్పోర్ట్స్ కారిడార్లు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా కింగ్ హమద్ అధికారులకు పలు సూచనలు చేశారు. 1934 నాటి అవాలి నగరం గొప్ప నాగరికత వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆధునిక సమగ్ర పట్టణ నిర్మాణాన్ని సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







