యూ. ఏ. ఈ. లో క్రెడిట్ కార్డుల ఆఫర్లను పొందలేకపోతున్న 76 శాతం వినియోగదారులు
- October 30, 2015
యూ. ఏ. ఈ. లో బాంకులు క్రెడిట్ కార్డ్ వినియోగదారులను ఆకర్షించడానికి ఉచిత విమాన ప్రయాణాల నుండి ఫుట్ బాల్ టికెట్ల వరకు అనేక ఆకర్షణీయ ఆఫర్లను ఇస్తున్నప్పటికీ, కొమ్పరిట్ ఫర్ మీ గ్రూపు వారి సర్వే ప్రకారం 76 శాతం మందికి పైగా వేలాది దిర్హాం ల విలువగల ఆ ఉచిత లాభాలను పొందలేకపోతున్నారు. అవగాహనా లోపం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన క్రెడిట్ కార్డులకై ప్రతి సంవత్సరం ఫీజు చెల్లిస్తూ, మళ్లీ అందుబాటులో ఉన్న రివార్డులను ఉపయోగించుకోలేక రెండు విధాల నష్టపోతున్నారు. 5.9 మిలియన్ల డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు దేశంలో చలామణి లో ఉండగా, వారికి అందుబాటులో ఉన్న అన్ని ఆర్ధిక అవకాశాలను పోల్చిచుసుకుని, తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన వాటిని ఎంపిక చేసుకొనేలా వారి అవగాహన పెంచడానికి కొమ్పరిట్ ఫర్ మీ సంస్థ యొచి స్తోంది. కాగా, ఎమిరేట్స్ ఎన్. బి. డి. వారు క్కూడా, క్రెడిట్ కార్డుల ద్వారా వాడబడే మొత్తాల 17 శాతాన్ని హోటల్ మరియు డైనింగ్ కు, 13 శాతాన్ని పర్యటనలకు వినియోగిస్తున్నారని, ప్రజల అవగాహన పెరగడం వలన ఈ సంఖ్యలు మరింతగా అభివృద్ధి చెందనున్నాయని వారు విశ్లేషించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







