36 ఏళ్ళ వయసొచ్చినా ఆమె పరిస్థితి దయనీయం

- September 16, 2017 , by Maagulf
36 ఏళ్ళ వయసొచ్చినా ఆమె పరిస్థితి దయనీయం

మనామా: భారతదేశంలో 36 ఏళ్ళుగా విదేశీయురాలిగా జీవిస్తున్న ఓ మహిళ ఎట్టకేలకు బహ్రెయిన్‌ చేరుకుని, తన జాతీయతపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని హై అడ్మినిస్ట్రేటివ్‌ కోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. 1980లో బహ్రెయినీ తండ్రికీ, భారతీయురాలైన మహిళకి సదరు మహిళ జన్మించింది. అయితే ఆ తర్వాత ఆ బహ్రెయినీ తండ్రి, ఆ భారతీయురాలితో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన బిడ్డను తీసుకుని ఆ మహిళ, కొన్ని అనివార్య కారణాలతో బహ్రెయిన్‌ని విడిచపెట్టాల్సి వచ్చింది. పదేళ్ళలోపు ఆ చిన్నారి తిరిగి బహ్రెయిన్‌కి చేరుకోవాల్సి ఉన్నా, అందుకు తగిన పత్రాల్ని అందించడంలో ఆ చిన్నారి తండ్రి విఫలమయ్యారు. దాంతో ఆ చిన్నారి ఇటు భారతీయురాలు కాలేక, అటు బహ్రెయినీ పౌరసత్వం పొందలేక అయోమయ స్థితిలో ఉండిపోయారు. ఎట్టకేలకు ఆమె బహ్రెయిన్‌లోకి ప్రవేశించి, అక్కడే తన పౌరసత్వం కోసం పోరాటం చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com