ఆత్మహత్య కాదది హత్య
- September 16, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా పోలీస్ చేపట్టిన విచారణలో ఆత్మహత్యగా నమోదైన ఓ కేసు హత్య అని వెలుగు చూసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఈ కేసుని ఛేదించింది. 24 గంటల్లోనే అది ఆత్మహత్య కాదు, హత్య అని తేల్చింది సిఐడి. సిఐడి డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా అల్ ముంకిస్ మాట్లాడుతూ, ఆత్మహత్య కేసుని ఛేదించి కేవలం 24 గంటల్లోనే నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆసియాకి చెందిన కార్మికుడి మృతదేహం, తాడుకి వేలాడుతూ కన్పించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి, అది ఆత్మహత్య కాదని తేల్చారు. ఆసియాకి చెందిన మరో వ్యక్తిని నిందితుడిగా తేల్చారు. ఇద్దరి మధ్యా చోటుచేసుకున్న వాగ్యుద్ధమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







