డేరాకు పెరగనున్న జైలు శిక్ష
- September 16, 2017
ఇప్పటికే రెండు అత్యాచారం కేసుల్లో దోషిగా నిర్ధారణ అయ్యి, ఇరవై సంవత్సరాల శిక్షను ఎదుర్కొంటూ జైలు పాలైన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ మరో రెండు హత్య కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నాడు. డేరా బాబా అక్రమాల గురించి వార్తలను ప్రచురించిన ఒక జర్నలిస్టు, బాబాకు ఎదురుతిరిగిన డేరా మేనేజర్ ఒకరు కొన్నేళ్ల కిందట హత్యకు గురయ్యారు. తుపాకీతో కాల్చి వారిని చంపారు అగంతకులు. ఈ కేసులపై కూడా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసు సీబీఐ కోర్టు ముందుకు మరోసారి విచారణకు రానుంది.ప్రస్తుతం గుర్మీత్ రోహ్‌తక్ జైల్లో ఉన్నాడు. అక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని కోర్టు విచారించనుంది. హత్య కేసుల్లో పక్కా ఆధారాలను సీబీఐ అధికారులు సమర్పించారని సమాచారం. మరి ఇప్పటికే ఇరవై సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడే గుర్మీత్. మరి ఈ కేసుల్లో కూడా అతడు దోషిగా తేలితే.. జైలు శిక్ష మరింత పెరుగుతుందా? లేక ఏకంగా ఉరి శిక్షే పడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు డేరా బాబాపై హత్య కేసుల విచారణ నేపథ్యంలో హర్యానాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రేప్ కేసుల్లో గుర్మీత్ ను దోషిగా ప్రకటించినప్పుడు, అతడికి శిక్ష పడినప్పుడు అతడి అనుచరులు భారీ ఎత్తున అల్లర్లు సృష్టించారు. వందల కోట్ల ఆస్తుల నష్టం కలిగించారు. హత్య కేసుల విచారణ నేపథ్యంలో అలాంటి అల్లర్లకు ఆస్కారం ఉందని పోలీసులు..ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







