మణిరత్నం ముల్టీస్టార్రర్ చిత్రం.!
- September 16, 2017
కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చేమో కానీ... ఆయన ఆలోచనలు ఎప్పుడూ హిట్టే. అందుకే సినిమాలు వసూళ్ల వర్షం కురిపించకపోయినా... సినిమాల కాన్సెప్ట్‌లు కిర్రాక్ ఉంటాయి. బడ్జెట్ లెక్కలేసుకోకుండా సినిమాలు తీసే మణిరత్నం కొత్త సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించారు. అంతేకాదు భారీ తారాగణం కూడా సిద్ధమైంది. 'చెలియా' తర్వాత తెరకెక్కించబోయే సినిమా వివరాలను మణిరత్నం ట్విటర్ ద్వారా వెల్లడించారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా మద్రాస్ టాకీస్ పతాకంపై రూపొందుతోంది. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతులు చేపడతారు. వచ్చే జనవరిలో సినిమా పట్టాలెక్కుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







