సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి అవకాశం ఇవ్వం: చైనా
- September 16, 2017
అప్పుడే చైనాకు ఉలుకు మొదలైంది. భారత్‌తో జపాన్ సంబంధాలు మరింత ధృడమవుతాయని, ఈశాన్య రాష్ట్రాలతో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో భారత్ జపాన్ కలిసి పరస్పరం సమన్వయంతో ముందుకు సాగుతాయని ప్రకటన చేయడంతో చైనా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో సరిహద్దు విభేదాల గురించి ప్రస్తావించారు.
సరిహద్దు సమస్యల విషయంలో మూడో వర్గానికి (జపాన్)కు అవకాశం ఇవ్వబోమని అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో తలపెట్టనున్న అభివృద్ధిపనులకు జపాన్ సహకారం అందించనున్న నేపథ్యంలో అందుకు తాము అనుమతించబోమంటూ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు భారత్‌లోని ఇతర ప్రధాని రాష్ట్రాలకు మధ్య పూర్తి స్థాయి సంబంధాలు నెలకొనేలా మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుచయనున్నట్లు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో పలుమార్లు చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







