హైదరాబాద్ మెట్రోకు అవార్డులు
- September 17, 2017
మెట్రో రైలు వ్యవస్థ దేశ రాజధాని ఢిల్లీ నుంచే ప్రారంభమైనా ప్రస్తుతం నిర్మాణంలో హైదరాబాద్ మెట్రోకు ఉన్న ప్రత్యేకత మరే మెట్రోకూ లేదు. ఇంజనీరింగ్‌కు సవాలుగా నిలిచే నిర్మాణాలు....దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం... పిల్లర్లు, వయాడక్ట్‌లు...మెట్రో స్టేషన్లు, డిపోలు, మెట్రో రైళ్లు ఇలా అన్నింటిలోనూ అత్యాధునికత హైదరాబాద్ మెట్రో రైలు సొంతం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణ మవుతుండడంతో ఆ స్థాయిలో అవార్డులు ఇప్పటికే మెట్రో ఖాతాలోకి వచ్చి చేరాయి. రవాణా ఆధారిత అభివృద్ధి అనే నినాదంతో అందుబాటులోకి రానున్న మెట్రోతో పాటు మెట్రో మాల్స్ సైతం నగరంలో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఇలా ఎన్నో అంశాలు మన మెట్రో సొంతం. సాంకేతికంగా, నిర్మాణ పరంగా... ఇలా ఏ కోణంలో చూసినా ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టుగానే చెప్పొచ్చు.ప్రారంభానికి ముందే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా నవంబర్ 28-30 తేదీల్లో మొదటి దశను మెట్రో 30కి.మీ మార్గం (మియాపూర్-అమీర్‌పేట-నాగోల్)లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
మెట్రో ప్రాజెక్టుకు వచ్చిన అవార్డులు..
న్యూయార్క్ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోరం 'ది గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్ అవార్డు-2013' ను సొంతం చేసుకుంది.
రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ విభాగంలో గోల్డ్ అవార్డులను వరసగా 2013, 2014, 2015 సంవత్సరాలకు దక్కాయి.
కన్స్ట్రక్షన్ వీక్ నిర్వహించిన ఇండియా అవార్డు కార్యక్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్-2013,2014 సంవత్సరాల్లో రెండేళ్లు వరసగా అవార్డులు వచ్చాయి.
ముంబయిలో నిర్వహించిన అమెరికన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ అవార్డు మెట్రో ప్రాజెక్టు సొంతమైంది.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన స్కోచ్ అవార్డు మెట్రో రైలుకు దక్కింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన హైదరాబాద్ మెట్రో రైలు శకటానికి ఉత్తమ అవార్డు వచ్చింది.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్-2017
మెట్రో రైలు ప్రారంభానికి ముందే ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ ట్రైన్ వ్రాప్ అడ్వర్టయిజ్మెంట్ హక్కులను పొందిన దేశంలోని మొట్టమొదటి హెచ్ఎంఆర్గా గుర్తింపు. జూలై 22వ-2014వ తేదీన వీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుంది. దీన్లో భాగంగా ట్రయల్ రన్స్‌లో హెచ్ఎంఆర్ మొదటి ట్రైన్ మూడు కోచ్‌లను ఫుట్‌వేర్ బ్రాండ్ సెంట్రో ప్రకటనలతో ఆగస్టు 7 -నవంబర్ 11-2014 తేదీ వరకు నాగోల్-మెట్టుగూడ మార్గంలో 8 కి.మీ నడిపారు.
నిర్మాణ దశలోనే ఉండగానే అన్ని మెట్రో స్టేషన్లలో పౌర్కింగ్ హక్కులను పొందింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 11-2015వ తేదీన హిందుస్తాన్ కోకా కోలా బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్(కోక్)తో ఎల్ అండ్‌టీ ఒప్పందం చేసుకుంది. మెట్రో ప్రారంభమైన తర్వాత నుంచి ఏడు సంవత్సరాల పాటు ఈ హక్కులు కోక్ దగ్గర ఉంటాయి.
మూడు కారిడార్లలో ఉన్న అన్ని మెట్రో స్టేషన్లలో ప్రసార హక్కులను శ్రేయాస్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అందించింది. దీనికి సంబంధించి జనవరి 29, 2015న ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. ఈ రికార్డులను 2017వ సంవత్సరం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రచురించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్









