ఫ్రాన్స్‌లో ఆదివారం యువతులపై యాసిడ్ దాడి....
- September 17, 2017
ఫ్రాన్స్‌లో ఆదివారం సాయంత్రం ఘోరం జరిగింది. అమెరికన్ విద్యార్థినిలపై రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా, ఉగ్రవాదిగా అనుమానించి నిందితురాలిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
బోస్టన్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిలు ప్రాజెక్టు పని కోసం దక్షిణ ప్రాన్స్‌కు వెళ్లారు. తాము ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో అక్కడే ఉన్న 41 ఏళ్ల మహిళ వారిపై యాసిడ్ కుమ్మరించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహిళను అరెస్ట్ చేశారు. బాధితులను చికిత్స కోసం మార్సిల్లె ఆస్పత్రికి తరలించారు.
తొలుత ఉగ్రవాద చర్యగా అనుమానించిన పోలీసులు మహిళను పలు కోణాల్లో విచారించారు. అయితే మతిస్థిమితం సరిగ్గా లేకనే ఆమె దాడికి పాల్పడినట్లు తేల్చారు. యువతుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఘటనపై యూఎస్ రాయబార కార్యాలయం సహకారంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు విద్యార్ఘుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







