దసరా బరిలోకి సాయిధరమ్ తేజ్ సినిమా
- September 17, 2017
దసరా పండుగ సందర్భంగా పలు సినిమాలు బరిలో నిలుస్తాయి. అలాగే కొన్ని సినిమాలకు చెందిన టీజర్లు, ఫస్ట్ లుక్స్ ని గిఫ్ట్ గా రిలీజ్ చేస్తూంటారు. మరికొన్ని కొత్త సినిమాలు సెట్స్ మీదకు వెళ్తుంటాయి. మంచి రోజులు కాబట్టి సినిమాకు మంచి ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం.
ఈ దసరాకి సెట్స్ మీదకు వెళ్తున్న చిత్రాల్లో సాయిధరమ్ తేజ్ మూవీ కూడా ఉంది. ఈ మధ్యే జవాన్ మూవీని కంప్లీట్ చేసిన ఈ మెగా హీరో దసరాకి కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించనున్నారు.
సెప్టెంబరు 27 నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అప్పటి నుంచి వరుస షెడ్యూల్స్ తో షూటింగ్ జరపనున్నారని తెలుస్తోంది. ఈ మూవీకి టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే దుర్గ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించనుంది. ఖైది నంబర్ 150 తర్వాత వినాయక్ తో స్టార్స్ సినిమా తీసే ప్రయత్నం చేసినా అందరు స్టార్స్ తమ తమ సినిమాల కమిట్మెంట్ తో ఉండగా ఫైనల్ గా సాయి ధరం తేజ్ కు ఫిక్స్ అయ్యాడు.
సాయి ధరం తేజ్ ఈ సినిమానే కాకుండా కరుణాకరణ్ తో సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. చూస్తుంటే ఈ రెండు సినిమాలతో మెగా మేనళ్ళుడు మరోసారి తన సత్తా చాటుతాదనిపిస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







