కళాబంధు ప్రొడ్యూసర్ టి.సుబ్బిరామిరెడ్డి బర్త్‌డే స్పెషల్
- September 17, 2017
వ్యాపారవేత్తగా జీవితాన్ని ప్రారంభించి, సినిమా రంగం వైపు ఆకర్షితులై వ్యక్తి టి సుబ్బిరామిరెడ్డి. తర్వాత ఆ ఇండస్ట్ర్రీనే తనవైపు ఆకర్షింపజేసుకున్న పవర్ ఫుల్ ఫిల్మీ పర్సన్ ఆయన. ఎక్కువ సినిమాలు నిర్మించకపోయినా.. జీవితంలో ఎక్కువ భాగం సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులతోనే మమేకమైన నిర్మాత సుబ్బిరామిరెడ్డి. ఒక్క పిలుపుతో టాలీవుడ్, బాలీవుడ్ బిగ్గీస్ ను ఒకే వేదికపైకి తీసుకురాగల పవర్ ఫుల్ పర్సన్ కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి పుట్టిన రోజు ఇవాళ.
సుబ్బిరామిరెడ్డి పుట్టింది నెల్లూరు.. రాజకీయనేపథ్యం ఉన్న కుటుంబంలో. హైదరాబాద్ నిజాం కాలేజ్ లో చదువుకున్నారు. చదువు తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే రాజకీయ రంగంలోనూ ఎదిగారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో కీలక పదవులు చేపట్టారు.
సుబ్బిరామిరెడ్డి తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లోని ఎందరో నటీనటులు, టెక్నీషియన్స్ తో పెద్ద పరిచయాలే ఉన్నాయి. అయితే సినిమా పరంగా మాత్రం తనదైన స్టైల్ లోనే చేశారు. తెలుగులో ఆయన చేసిన ఫస్ట్ మూవీ జీవనపోరాటం. సోగ్గాడు శోభన్ బాబు, అప్పటి అప్ కమింగ్ హీరో రజినీకాంత్, విజయశాంతి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీలో వచ్చిన రోటీ కపడా ఔర్ మకాన్ అనే హిందీ సినిమాకు రీమేక్.
జీవనపోరాటం చేసిన యేడాదిలోనే హిందీలోనూ మిథున్ చక్రవర్తి, స్మితాపాటిల్, మీనాక్షి శేషాద్రి ప్రధాన పాత్రల్లో దిల్ వాలే చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బప్పీలరహరి సంగీతసారథ్యంలో వచ్చిన దిల్ వాలే పాటలు కూడా సూపర్ హిట్. దీంతో ఒకే యేడాది అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో రెండు విజయాలు సొంతం చేసుకుని నిర్మాతగా శుభారంభం చేశారు.
తెలుగులో చిరంజీవి పేరు మాస్ మేనియా అయింది. అలాంటి చిరుతో సుబ్బిరామిరెడ్డిది ప్రత్యేక అనుబంధం. ఆ అనుబంధంతోనే చిరంజీవితో స్టేట్ రౌడీ నిర్మించారు. బి. గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన స్టేట్ రౌడీ అప్పటి తెలుగు స్టేట్ ను ఓ ఊపు ఊపేసింది. చిరంజీవి, బి. గోపాల్ ల హిట్ మంత్రాను సుబ్బిరామిరెడ్డి కరెక్ట్ గా క్యాచ్ చేశారు.. క్యాష్ చేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ అందించిన కథ, మాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవికి అప్పటి ఉన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో స్టేట్ రౌడీ ఒకటి.
స్టేట్ రౌడీ తెలుగులో ఓ సంచలనం. రౌడీ పోలీస్ కథలకు ఇది కొత్త ఊపు తెచ్చిన సినిమా. ఆ మధ్య వచ్చిన పోకిరి సినిమా తమ కథలాగే ఉందని పరుచూరి బ్రదర్స్ కూడా పూరీ జగన్నాథ్ పై కంప్లైంట్ చేశారు. హిందీ నుంచి బప్పీలహరిని తెచ్చి చేసిన సంగీతంలోని పాటలు సూపర్ హిట్. అన్నీ మాస్ నంబర్సే. ఇప్పటికీ స్టేట్ రౌడీ పాటలకు స్టేజ్ షోస్ లో చాలామంది డ్యాన్స్ వేస్తుంటారు.
హిందీలో చేసిన చాందిని ఆల్ టైమ్ గ్రేట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. అప్పటికే బాలీవుడ్ లో పాగా వేసిన శ్రీదేవిని చాందిని బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ను చేసింది. అలాగే హీరోగా కెరీర్ ఫేడవుట్ దశలో ఉన్న రిషికపూర్ కు కొంతకాలం సర్వైవ్ అయ్యేంత బ్రేక్ నిచ్చింది. నేషనల్ అవార్డ్ నూ అందుకుంది చాందిని.
యశ్ చోప్రా డైరెక్ట్ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చాందిని ఆయన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. 1989లో వచ్చిన చాందిని మూవీ అనేక విశేషాలకు వేదికయ్యింది. రిషికపూర్, వినోద్ ఖన్నా కలిసి అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో 1977లో చివరి సారిగా నటించారు. తర్వాత మళ్లీ ఈ సినిమాలోనే ఆ ఇద్దరూ కలిసి నటించారు. శ్రీదేవి వైట్ కాస్ట్యూమ్స్ కూడా విపరీతంగా ఫేమ్ అయ్యాయి. అలాగే శివ్-హరి ద్వయం అందించిన పాటలు దేశం మొత్తాన్నీ ఓ ఊపుఊపేశాయి..
సుబ్బిరామిరెడ్డి ఏ ఉద్దేశ్యంతో చేశారో కానీ ఒకేయేడాది తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో సినిమాలు నిర్మించారు. హిందీలోనే ఎక్కువ విజయాలు సాధించారు. కానీ ఫస్ట్ టైమ్ భారీ అంచనాలతో వచ్చిన లమ్హే మాత్రం డిజప్పాయింట్ చేసింది. మరోసారి యశ్ చోప్రా డైరెక్షన్ లో శ్రీదేవి హీరోయిన్ గా చేసిన సినిమా ఇది. యశ్ చోప్రాకు గొప్ప పేరు తెస్తే శ్రీదేవికి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ తెచ్చింది. కానీ లమ్హే కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.
ఇక తెలుగులో స్టేట్ రౌడీ తర్వాత కమర్షియల్ గా పెద్ద విజయాలు సాధించలేదు. అయితే రెండు ఫ్లాపులు రాగానే నిర్మాణమూ ఆపేశారు. సూర్య ఐపియస్ తర్వాత తెలుగులో నేరుగా ఏ సినిమా నిర్మించలేదు. వెంకటేష్, విజయశాంతి జంటగా బి గోపాల్ డైరెక్షన్ లో ఇళయరాజా సంగీతసారథ్యంలో వచ్చిన సూర్య ఐపియస్ కూడా పెద్దగా ఆడలేదు.
హిందీలో చేసిన భగవద్గీత సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. 1998లో చేసిన స్వామివివేకానంద చేశారు. టైటిల్ రోల్ లో సిరివెన్నెల ఫేమ్ సర్వదమన్ బెనర్జీ, రామకృష్ణ పరమహంసగా మిథున్ చక్రవర్తి నటించిన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి పూర్తి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మిథున్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది..
ఓవరాల్ గా టి. సుబ్బిరామిరెడ్డి నిర్మాతగా చేసింది తక్కువ సినిమాలే. కానీ తెలుగు, హిందీ చిత్రాలపై టి సుబ్బిరామిరెడ్డి ప్రభావం ఎక్కువ. అందుకే ఎప్పుడూ ఇండస్ట్ర్రీతో సంబంధాలు తెంచుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్ర్రీలో ఉన్న చాలామంది కంటే ఎక్కువగా పరిశ్రమతో సంబంధాలు మెయిన్టేన్ చేస్తుంటారు. టి సుబ్బిరామిరెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను స్థాపించి కొంతకాలంగా ప్రతిభావంతమైన ఆర్టిస్టులకు అవార్డులు అందిస్తోన్న ఆయన నిన్న తన బర్త్ డే సందర్భంగా అలనాటి నటి జమునను సత్కరించారు..
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







