డెంగ్యూని నివారించడానికి ఇంటి చిట్కాలు
- October 30, 2015
ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న డెంగ్యూ మహమ్మారిని తరిమికొట్టడానికి ఇంట్లోనే చక్కటి పరిష్కారాలున్నాయి. ఉన్నట్టుండి జ్వరంతో మొదలై.. కొన్ని వారాలపాటు వ్యాధి లక్షణాలు రోగులను వేధిస్తున్నాయి. తీవ్ర తలనొప్పి, కీళ్ల నొప్పులు డెంగ్యూ వ్యాధి ప్రధాన లక్షణాలు. చర్మంపై దురదలు కూడా డెంగ్యూ లక్షణాల్లో ఒకటి.రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 10 ఉత్తమ ఆహారాలు ఈడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం సోకుతోంది. డెంగ్యూ సోకినప్పుడు నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. జ్వరం తగ్గినా.. ఈ నొప్పులు కొన్ని వారాలపాటు బాధిస్తాయి. ఆకలి ఉండదు. చర్మంపై దురదలు, మచ్చలు రావడం, ప్లేట్ లెట్స్ తగ్గిపోతాయి. ఈ వైరస్ సోకిందని నిర్ధారణ అయినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇది తీవ్రం కాకుండే.. ఇంట్లోనే పరిష్కార మార్గాలు ఫాలో అవడం మంచిది. డెంగ్యూ నివారించడానికి ఇంట్లో ఉన్న చక్కటి మార్గాలేంటో తెలుసుకుందాం.. డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి తులసి ఆకులు చక్కటి పరిష్కారం. రోజుకి రెండు సార్లు.. 10 నుంచి 15 తులసి ఆకులు నమలడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలతో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉమ్మెత్త ఆకులు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్ బారి నుంచి తగ్గించి.. జ్వరాన్ని నివారించడానికి ఈ ఆకులు తోడ్పడతాయి. డెంగ్యూ నివారణలో చక్కటి పరిష్కారంగా మెంతులు చెప్పవచ్చు. మెంతులతో చేసిన టీ తాగితే మంచిది. నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించి.. ప్రశాంతతో కూడిన నిద్రకు మెంతులు సహకరిస్తాయి. ఉసిరి జ్యూస్ తాగడం వల్ల.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే.. రోజుకు ఒకసారి ఉరిసి జ్యూస్ తాగండి. డెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి. రోజుకి ఒక గ్లాస్ బొప్పాయ రసం తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు. ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కి శక్తినిస్తుంది. డెంగ్యూ జ్వరంలో ముందుగా వేధించే పెద్ద సమస్య ప్లేట్ లెట్స్ పడిపోవడం. కాబట్టి.. దానిమ్మ జ్యూస్, బార్లీ గ్రాస్ టీ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ ని పెంచవచ్చు. ప్లేట్ లెట్స్ స్థాయిని పెంచడంలో బార్లీ గ్రాస్ టీ బాగా సహాయపడుతుంది. వేపాకులను ఉడకబెట్టి.. ఆ నీటిని తాగడంవల్ల.. వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్ లెట్స్ ని పెంచవచ్చు. దీంతో పాటు.. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మంచి నీళ్లు ఎలాంటి రోగానికైనా.. చక్కటి పరిష్కారం. అయితే.. డెంగ్యూ జ్వరం నివారణలో నీళ్లు బాగా సహకరిస్తాయి. బాడీ పెయిన్స్, తలనొప్పి, కండరాల నొప్పులను నివారించడానికి నీళ్లు బాగా తాగాలి. శరీరంలో ఉన్న విషాన్ని బయటకు పంపడానికి కూడా నీళ్లు ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









