యూఏఈ యూఏఈలో మంచి ఉద్యోగాలు, మెరుగైన జీతాలు
- September 18, 2017
బెయట్ డాట్ కామ్, యూగవ్ జాబ్ సైట్స్ నిర్వహించిన ఓ సర్వేలో, యూఏఈ బిజినెస్ కండిషన్స్‌లో గణనీయమైన వృద్ది సాధించనుందని తేలింది. సర్వేలో 74 శాతం మంది సానుకూలంగా స్పందిస్తే, 17 శాతం మంది ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. 9 శాతం మంది మాత్రం పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని సమాధానమిచ్చారు. ప్రస్తుతం యూఏఈలో అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగాలు దొరుకుతున్నాయని మెజార్టీ అభిప్రాయం ద్వారా వెల్లడయ్యింది. పలు ఇండస్ట్రీల్లో పెద్దయెత్తున ఉద్యోగాల లభ్యత ఉందని సర్వే తేల్చింది. ఉద్యోగానికి సంబంధించి గ్రోత్ ఆపర్ట్యూనిటీస్‌పై 50 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 24 శాతం మంది న్యూట్రల్‌గా వ్యవహరించారు. వర్క్ - లైఫ్ బ్యాలెన్స్‌కి సంబంధించి 48 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. 24 శాతం మంది ఇక్కడా న్యూట్రల్‌గా వ్యవహరించడం జరిగింది. కెరీర్ గ్రోత్ పరంగా చూస్తే 53 శాతం మంది పాజిటివ్ యాటిట్యూడ్‌తో కనిపించారు. 12 శాతం మంది నిరాశ వ్యక్తం చేశారు. రానున్న ఆరు నెలల్లో మెరుగైన అవకాశాలు వస్తాయని 47 శాతం మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులకు సంబంధించి 63 శాతం మంది యూఏఈ రెస్పాండెంట్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. 12 శాతం మంది నిరాశా ధోరణిలో కన్పించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







