ట్విట్టర్ సీనియర్ డైరక్టర్‌గా శ్రీరామ్ కృష్ణన్

- September 19, 2017 , by Maagulf
ట్విట్టర్ సీనియర్ డైరక్టర్‌గా శ్రీరామ్ కృష్ణన్

మైక్రోబ్లాగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో భారతీయ సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ సీనియర్ డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. గతంలో ఫేస్‌బుక్, స్నాప్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా చేశాడతను. తాను త్వరలో ట్విట్టర్‌లో చేరనున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపాడు శ్రీరామ్. సిలికాన్ వ్యాలీలో కృష్ణన్‌కు మంచి పేరుంది. బెస్ట్ ప్రోడక్ట్ ఎగ్జిక్యూటివ్‌గా అతన్ని గుర్తిస్తారు. యాడ్ టెక్నాలజీ మీద అతను ఎక్కువగా ఫోకస్ చేశాడు. ట్విట్టర్ ఫ్యామిలీకి స్వాగతం అంటూ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ సోమవారం ట్వీట్ చేశాడు. ఫేస్‌బుక్ యాడ్ నెటవర్క్, ఆడియన్స్ నెట్‌వర్క్‌లను శ్రీరామ్ బిల్డప్ చేశాడు. స్నాప్‌లో కంపెనీ ఏపీఐ యాడ్స్‌ను కూడా ఇతనే డెవలప్ చేశాడు. ట్విట్టర్ ప్రోడక్ట్ వైసి ప్రెసిడెంట్ కీత్ కోల్మన్‌కు కృష్ణన్ రిపోర్ట్ చేయనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com