ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ మెగా ఫెయిర్ టిక్కెట్
- September 19, 2017
మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ మెగా ఫెయిర్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ 2017కి సంబంధించి టిక్కెట్ లాంఛింగ్ సెర్మానీ ఇసా టౌన్‌లోని జషాన్మాల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. జయానీ మోటర్స్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ జాకి, క్యాపిటల్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఖాలిద్ బెచీరీ, క్రౌన్ ఎలక్ట్రో మెకానికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఎస్.ఇనయదుల్లా తొలి టిక్కెట్‌ని ఇండియన్ స్కూల్ ఛైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్ నుంచి అందుకున్నారు. ఐఎస్‌బి ఎగ్జిక్యూటివ్ కమిటీ వైఎస్ ఛైర్మన్ ముహమ్మద్ ఇక్బాల్, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సిజి మనోజ్‌కుమార్, మెంబర్ ఫైనాన్స్ ఎస్‌కె రామచంద్రన్, మెంబర్ ఐటీ సాజి ఆంటోనీ, మెంబర్ అకడమిక్స్ ముహమ్మద్ ఖుర్షీద్ అలామ్, మెంబర్ స్పోర్ట్స్ జయాఫర్ మైదాని, స్టాఫ్ రిప్రెజెంటేటివ్ ప్రియా లాజి సమక్షంలో ఈ టిక్కెట్ స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఐఎస్‌బి మెగా ఫెయిర్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ అక్టోబర్ 12, 13 తేదీల్లో ఇసా టౌన్ క్యాంప్‌లో జరుగుతుంది. ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ నకాష్ అజీజ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ కానుంది. మొదటి రోజున ఈ కార్యక్రమం జరగనుండగా, రెండో రోజు ప్రముఖ సింగర్స్ శ్రీనివాస్, జ్యోత్స్న, విష్ణు రాజ్ ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఐఎస్‌బి ఛైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నిథుల్ని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆదుకునేందుకు వినియోగిస్తామని చెప్పారు. మెగా రఫాలె డ్రా అక్టోబర్ 13న జరుగుతుంది. మెగా ఫెయిర్‌కి ఎంట్రీ టిక్కెట్ 2 బహ్రెయినీ దినార్స్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









