మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో డేరా బాబా కూతురు హనీప్రీత్
- September 19, 2017
మొన్నటివరకు ఆమె ఆడిందే ఆట.. పాటిందే పాట. డేరాలో బాబా తర్వాత ఆమెదే టాప్ ప్లేస్. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడామె మోస్ట్‌వాంటెడ్ లిస్ట్‌లో నెంబర్ వన్ కిలాడి. ఆమె ఎప్పుడు దొరుకుతుందా అని.. దేశమంతా జల్లెడ పడుతున్నారు పోలీసులు. అత్యాచారం కేసులో గుర్మీత్ రాంరహీం జైలుకెళ్లినట్టే.. ఆయన అనుచరులకు కారాగారయోగం పట్టబోతోంది. ముఖ్యంగా హనీప్రీత్ కోసం సెర్చింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 25న బాబాను దోషిగా కోర్ట్ ప్రకటించి శిక్ష విధించగానే.. ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. నాటి అల్లర్లు 38 మందిని బలిగొన్నాయి. ఆ హింసకు కారకులుగా పోలీసులు 43 మందితో జాబితా విడుదల చేశారు. అందులో.. హనీప్రీత్ సింగ్, ఆదిత్య ఇన్సాన్ టాప్‌లో ఉన్నారు.
హనీప్రీత్ సింగ్ .. డేరా బాబా గుర్మీత్‌కు ఆత్మలాంటిది. అల్లర్లకు ఆమె ప్రధాన సూత్రధారిగా పోలీసుల అభియోగం. డేరా నుంచి బాబా కోర్టుకెళ్లే వరకు ఆయన వెంటనే ఉన్న గుర్మీత్.. రోహ్తక్ జైలు వరకు అతనితోనే స్పెషల్ చాపర్‌లో వెళ్లారు. ఆ తర్వాత నుంచి కనిపించట్లేదు. శిక్ష పడిన వెంటనే.. బాబాను తప్పించేందుకు హనీ ప్రయత్నించిందట. హింస ప్రజ్వరిల్లడంలోను ఆమె పాత్రపై అనుమానాలున్నాయి. అజ్నాతంలోకి వెళ్లిన హనీ కోసం ప్రత్యేక టీమ్‌లు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ గుండా నేపాల్‌లోకి పారిపోయే అవకాశాన్ని కొట్టిపారేయడం లేదు. అందుకే.. నేపాల్ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు మోహరించాయి. హనీప్రీత్ వేషం మార్చినా.. పట్టుకునేలా సుశిక్షితులతో నిఘా పెంచారు. వివిధ గెటప్లలోని ఆమె ఫోటోలను పంపిణీ చేస్తూ.. స్థానికుల్ని సైతం అలర్ట్ చేశారు.
మరోవైపు.. ఏ3 ప్రకాష్ ఉరఫ్ విక్కీని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను బాబాకు బంధువు, అత్యంత సన్నిహితుడు. అతినిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఆగస్టు 25న విక్కీనే రోహ్తక్లోని జైలు దగ్గర నుంచి హనీప్రీత్‌ను బయటకు తీసుకువెళ్లాడు. తర్వాత హిస్సార్ వైపు వెళ్లారు. వీరివెంట ఇంకొందరు ఉన్నారు. పంచకుల హింసలో ప్రకాష్, ఆదిత్య కలిసి పాల్గొన్నట్లు సమాచారం. మరో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరిచగా.. వారికి కోర్టు 5 రోజుల రిమాండ్ విధించింది. వాళ్లిచ్చే సమాచారం ఆధారంగా మిగతావారిని పట్టుకుంటామంటన్నారు పోలీసులు. మోస్ట్ వాంటెండ్ హన్ప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేస్తే.. అల్లర్ల వెనుకున్న అసలు కుట్ర బయటపడుతుందంటున్నారు.
తాజా వార్తలు
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...
- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్‌లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!









