అక్టోబర్ రెండవ వారంలో తెలుగు సినిమాలుకు పోటీగా మూడు తమిళ సినిమాలు
- September 19, 2017
టాలీవుడ్లో చిన్న పెద్ద సినిమా ల మేకింగ్ ఎక్కువైంది. ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలు సందడి చేస్తున్నాయి. మన వాళ్ళ మధ్యే ఇంత పోటీ ఉంటే... మధ్యలో తమిళ్ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. వచ్చే నెలలో మూడు తమిళ సినిమాలు మన తెలుగు సినిమాలతో పోటీపడబోతున్నాయి.
దసరా సీజన్ తర్వాత మళ్ళీ సంక్రాంతి వరకూ ఎదురు చూసే వారు.. కానీ సినిమాల తయారీ ఎక్కువగా ఉన్నది.. కనుక ఎప్పుడు వీలైతే.. అప్పుడే తమ సినిమాలను రిలీజ్ చేసుకొనే అవసరస్మ్ ఏర్పడింది.. పైగా ఇది వరకులా ప్రేక్షకుల కూడా ఫలానా సమయంలో సినిమాలు చూడాలి అనే ఫీలింగ్ ని వదిలేశారు.. ఎప్పుడు సినిమా రిలీజైనా.. ఆ సినిమా కధలో కొత్తదనం.. నేపద్యంలో ధమ్ముంటే ఆదరిస్తున్నారు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తున్నారు. దీంతో సీజన్ తో పనిలేకుండా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో వచ్చే నెల అక్టోబర్ లో మన తెలుగు సినిమాలు చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ సెకండ్ వీక్ లో నాగార్జున రాజుగారి గది2, రవితేజ రాజా ది గ్రేట్, గోపిచంద్ ఆక్సిజన్, మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు, సాయిధరమ్ తేజ్ జవాన్ తో పాటు మరి కొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
అయితే అక్టోబర్ లో ముగ్గురు తమిళ హీరోలు కూడా సందడి చేయబోతున్నారు. ముందుగా సెకండ్ వీక్ లోనే కార్తీ, తన కొత్త సినిమా కాఖీతో రాబోతున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ్ లో ఒకేరోజు రాబోతుంది. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలున్నాయి.
ఇక అక్టోబర్ లోనే మరో హీరో విక్రమ్ సినిమా కూడా రాబోతుంది. టాలెంటెడ్ హీరో విక్రమ్, తమన్నా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం స్కెచ్. ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే ఇదే నెలలో విశాల్ నటించిన సినిమా కూడా రాబోతుంది. తుప్పారివాలన్ గా రిలీజై సూపర హిట్ టాక్ తెచ్చుకున్న విశాల్ కొత్త సినిమా, డిటెక్టివ్ పేరుతో అక్టోబర్ లో వస్తోంది. ఈ ముగ్గురు హీరోలకు తెలుగులో కూడా మార్కెట్ ఉండటంతో, మన తెలుగు సినిమాలకు కాస్త పోటీ తప్పదు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







